
celebrating Rakhee Festival with sisters
ఆకేరున్యూస్,హనుయకొండ: మాజీ మంత్రి బీఆర్ ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు (ERRABELLY DAYAKAR RAO) ఇంట్లో రాఖీ ( RAKHEE CELEBRATIONS)వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రబెల్లి సోదరీమణులు తక్కళ్లపెల్లి అనంతలక్ష్మి, బియ్యల నళినిదేవి, తక్కళ్లపెల్లి వారిజలు ఎర్రబెల్లి నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. కుటుంబసభ్యులు అందరూ కలిసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ అక్కా-చెల్లెళ్ళ బంధం అపురూపమన్నారు. ప్రేమ, ఆప్యాయత, రక్షణకు ప్రతీక రాఖీ పౌర్ణమి అన్నారు.
———————————