
– ములుగు ఒక స్వచ్ఛమైన గాలి.. స్వచ్ఛమైన ప్రదేశం
– జంగాల పల్లి – రామప్ప జంక్షన్ వద్ద 69 లక్షల నిధులతో అభివృద్ధి సుందరీకరణ పనులను ప్రారంభించిన మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు మండలం జంగాలపల్లి-రామప్ప జంక్షన్ వద్ద 69 లక్షల నిధులతో అభివృద్ధి పనులు, సుందరీకరణ పనులను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రానున్న మేడారం మహాజాతరకు రూ.135 కోట్ల తో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని పర్యాటక అభివృద్ధి లో భాగంగా 6 కోట్లతో పలు జంక్షన్ లో సింబల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని 5 కోట్ల రూపాయలతో మేడారం జంపన్న వాగు పై సుందరీకరణ పనులు పూర్తి చేయడం జరుగుతుంది అని ఇలా పర్యాటకులను ఆకట్టుకునేలా అన్ని విధాలుగా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని మంత్రి అన్నారు.
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ ,గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి లతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు మరియు పంచాయతీ రాజ్ ఈ ఈ అజయ్ కుమార్, ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………………