* ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
* డిఎస్పీ రవిందర్
ఆకేరు న్యూస్,ములుగు: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో, ములుగు సబ్-డివిజన్లోని లోతట్టు ప్రాంతాలు మరియు జంపన్న వాగు పరివాహక ప్రాంతాలలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు డిఎస్పీ రవిందర్ తెలిపారు. ప్రజలు వరద నీటి ప్రవాహంలో ఉన్న వంతెనలు, కల్వర్టులు, రహదారులపై నుంచి దాటరాదని, శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండకూడదని,తడిగా ఉన్న విద్యుత్ కరెంట్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు తాకరాదని, గ్రామాల్లో చేపల వేటకు ఎవ్వరూ వెళ్లరాదని అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, వరద ప్రవాహాల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉంచబడిందని, ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యల కోసం జిల్లా విపత్తు ప్రతిస్పందన దళాలు (DDRF) ను ఏర్పాటు చేసాము. ఎటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజలు పోలీస్ సహాయం పొందేందుకు డయల్ 100 ను వినియోగించుకోవాలని కోరారు. భారీ వర్షాల కారణంగా ములుగు సబ్-డివిజన్లో పలు ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లి రహదారులపై వరద ప్రవాహం కొనసాగుతోందన్నారు.
ములుగు పోలీస్ స్టేషన్ పరిధి
బండారుపల్లి శివారులో రాళ్లవాగు పొంగి రహదారి మీదుగా వరద ప్రవహిస్తోంది. డైవర్షన్ రూట్: భూపాలపల్లి వైపు ప్రయాణం చేసే వారు జంగాలపల్లి మీదుగా వెళ్లాలి.
2. వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి
* నేషనల్ హైవే నుండి లింగాపూర్ వెళ్లే రహదారిలో సుద్ధవాగు పొంగి రహదారి మీదుగా ప్రవహిస్తోంది. డైవర్షన్ రూట్: లింగాపూర్ వెళ్లేవారు వెంకటాపూర్ మీదుగా ప్రయాణించాలి.
3. పస్రా పోలీస్ స్టేషన్ పరిధి
* పస్రా నుండి మేడారం వెళ్లే మార్గంలో ప్రాజెక్ట్ నగర్ దాటిన తరువాత బాంబులమోరి లేదా యాసంగి తోగు వద్ద రహదారి మీదుగా నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. డైవర్షన్ రూట్: మేడారం వెళ్లే వారు పస్రా – నార్లపూర్ మార్గం కాకుండా, పస్రా – తాడ్వాయి మార్గం ద్వారా ప్రయాణించాలి.
4. తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధి
1. చింతల్ నుండి ఎల్బాక మధ్యలో వాగు పొంగి బ్రిడ్జి మీదుగా ప్రవహిస్తోంది. డైవర్షన్ రూట్: ఎల్బాక, పడిగపూర్ వెళ్లేవారు మేడారం – కొంగలమడుగు మార్గం ద్వారా వెళ్లాలి.
2. ఊరటం గ్రామం సమీపంలో తుమ్మవాగు పొంగి బ్రిడ్జి మీదుగా ప్రవహిస్తున్నందున రాకపోకలు తాత్కాలికంగా నిషేధించబడ్డాయని వివరించారు.

…………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
