
* ఈ నెల 30న నుంచి ప్రారంభం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పెషల్ సెషన్‌కు ముహూర్తం ఖరారైంది. కాళేశ్వరం నివేదిక, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సహా ఇతర అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశాలు ఆగస్టు 30వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ భేటీలో స్పెషల్ సెషన్‌కు సంబంధించిన ఎజెండా ఖరారు కానుంది. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లోనే సభ్యులందరికీ కమిషన్ రిపోర్ట్‌ను ప్రభుత్వం అందించనుంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై కూడా చర్చించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ చర్చలకు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
…………………………………………………