
* తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ (ఎన్జీటీ) ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతి వచ్చేవరకు ఎలాంటి పనులు చేపట్టరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు నీటి సౌకర్యాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సొంత నియోజకవర్గంలో నారాయణపేట- కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కు రూపకల్పన చేసిన విషయం విదితమే. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అధికారులు సర్వే చేపట్టగా స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం కూడా విదితమే.
…………………………………