
* ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు
* అభినందించిన చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్
ఆకేరున్యూస్, హనుమకొండ : హనుమకొండ రెడ్డి కాలనీలోని వికాస్ మాస్టర్ జీ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన వినాయక చవితి సెలబ్రేషన్స్ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు శాన్విక పార్వతి వేషధారణలో, అక్షయ శివుడి వేషధారణలో మరో విద్యార్థి వినాయకుని వేషధారణలో నాటికలు, పద్యాలు, ప్రదర్శనలతో తన ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ జీ విద్యాసంస్థల చైర్మన్, మాజీ కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై పిల్లల ప్రతిభను ప్రశంసించారు. అనంతరం సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో భక్తి భావాన్ని పెంపొందించడంతోపాటు మన సంస్కృతిని తెలుసుకునే ఆసక్తిని కలిగిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమం చివరగా వినాయకుడికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రాగి వాణి , ఏఓ నాగరాజు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
…………………………………….