
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా లోని పసర ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కమలాకర్ కు ఉత్తమ ఎస్ఐ ప్రశంస పత్రం పాటు రివార్డును ములుగు ఎస్ పి పి. శబరీష్ ఐపీఎస్ చేతుల మీదుగా ప్రశంస పత్రం రివార్డ్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ ఐ కమలాకర్ మాట్లాడుతూ నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి నేరాలను చాకచక్యంగా పరిష్కరించినందున విధులను గుర్తించి నగదు బహుమతి రివార్డులు అందజేయడం జరుగిందన్నారు. గంజాయి , దొంగతనాలు నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టడం, పశువుల అక్రమ రవాణా అడ్డుకోవడం, పిడిఎస్ రైస్ అక్రమంగా తరలించేవారిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. విధి నిర్వహణలో సహకరించిన అధికారులకు, స్టేషన్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. రివార్డు అందుకున్న ఎస్ఐ కమలాకర్ కు డిఎస్పీ రవీందర్ ,సిఐ దయాకర్ , పోలీస్ స్టేషన్ సిబ్బందితొ పాటు స్థానికులు అభినందనలు తెలిపారు.
…………………………………………………….