
బద్ద శత్రువుల ఆత్మీయ పలకరింపు
* సిరిసిల్లలో బండి..కేటీఆర్ ల కరచాలనం
* కార్యకర్తల కేరింతలు
ఆకేరు న్యూస్, డెస్క్ : సోషల్ మీడియా(SOCIAL MEDIA)లో ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఎప్పుడు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉప్పునిప్పులా ఉండే బండి సంజయ్(BANDI SANJAY) , కేటీఆర్ (KTR)లు ఒకరికొకరు ఎదురుపడి షేక్ హ్యాండ్ ఇచ్చుకొని కాసేపు చిరునవ్వులు చిందిస్తూ మచ్చటించుకున్నారు. వివరాల్లోకి వెళితే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గంభీరావుపేట (GAMBHEERAOPET)మండలం నర్మల ఎగువ మానేరు (UPPAR MANAIR)వద్ద ఐదుగురు రైతులు వరదలో చిక్కుకుపోగా హెలీకాప్టర్ సహాయంతో వారిని కాపాడారు. ఈ నేపధ్యంలో బండి సంజయ్ బాధితులను పరామర్శించి వెనుతిరుగుతుండగా అదే సమయంలో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అప్పర్ మానేరు జలాశయం వద్దకు చేరుకున్నారు.ఇద్దరు పరస్పరం ఎదురుపడగా పలకరించుకొని యోగ క్షేమాలు తెలుసుకొని ముచ్చటించుకున్నారు.ఇద్దరు నేతలు ముచ్చటించుకున్న సమయంలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
—————————-