
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు ఇల్లు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తోంది. గతంలో ధర్మసాగర్, హసన్‌పర్తి మండలాల్లో తాహసీల్దార్‌గా నాగేశ్వర్రావు పనిచేశారు. ధర్మసాగర్, హసన్‌పర్తి మండలాల్లో పని చేసిన కాలంలో నాగేశ్వర్రావు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఖిలా వరంగల్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్డు, మామునూరు ఎయిర్‌పోర్టు భూ సేకరణకు సంబంధించి కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎంతోకాలంగా తహసీల్దార్ కార్యకలాపాలపై నిఘా పెట్టిన అవినీతి నిరోధకశాఖ అధికారులు శుక్రవారం ఏకకాలంలో కాజీపేట ప్రశాంత్‌నగర్, ఖమ్మం జిల్లాలోని ఇళ్లపై దాడులు చేస్తున్నారు. నాగేశ్వర్రావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నామని అవినీతి నిరోధక శాఖాధికారులు చెబుతున్నారు.
………………………………………………..