
* రేపు నాకూ ఆ పరిస్థితి రావచ్చు
*ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీసేలా ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాముడులాంటి వాడని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజాసింగ్ కు ఇప్పుడు కష్టాలు వచ్చాయని రాముడు లాంటి వ్యక్తులకే కష్టాలు తప్పలేదని చెప్పుకొచ్చారు. రేపు తనకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురు కావచ్చని అన్నారు. ఈ నేపధ్యంలో ఇటీవలే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు రాకేశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు పోలికలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అనుమాన పడుతున్నారు. ఇటీవల రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీలో చాలా మంది అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. బీజేపీలో స్వేచ్ఛ లేదని తమ అభిప్రాయాలను బయటికి చెప్పుకునే అవకాశం లేదని అన్నారు. పార్టీ అధిష్టానం తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాత తాను ఇప్పడు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నానని అన్నారు. ఈ నేపధ్యంలో రాకేశ్ రెడ్డి రాజాసింగ్ గురించి మాట్లాడుతూ రేపు తనకు కూడా ఇలాంటి పరిస్థితుల వస్తాయేమో అన్నారు. రాకేశ్ రెడ్డి ఇలా మాట్లాడడం పార్టీలో ఉన్న అసంతృని అద్దం పడుతోందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
…………………………………..