* సీఎం రేవంత్, కేటీఆర్ లు హైకోర్టులో పిటిషన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తమపై ఉన్న కేసులను కొట్టివేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావులు హై కోర్టులో మంగళవారం పిటిషన్లు దాఖలు చేశారు. 2021వ సంవత్సరంలో సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.2021లో ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ ఆధ్వర్యంలో రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టగా ఆయనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ కేసులో రేవంత్‌రెడ్డికి హాజరు నుంచి హైకోర్టు మినహాయింపునిచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను హై కోర్టు ఆదేశించి, తదుపర విచారణ ఆక్టోబరు 7వ తేదీకి వాయిదా వేసింది. అలాగే మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావుపై సృజన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కేటీఆర్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పీపీని ఆదేశించి, తదుపరి విచారణను అక్టోబరు 9వ తేదీకి వాయిదా వేసింది.
………………………………..
