*కామారెడ్డిలో వరద బాధితులను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, కామారెడ్డి : ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉంటూ నేనున్నానంటూ ధైర్యం చెప్పే వాడే నాయకుడు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన కామారెడ్డి జిల్లాలో వరద కు గురైన ప్రాంతాలను పరిశీలించి బాదితులను పరామర్శించారు. వందేళ్లలో ఎన్నడూ రానంతగా వరదలు వచ్చాయని సీఎం అన్నారు. బాధితులకు అండగా ఉండి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదుకున్నారని సీఎం కొనియాడారు. మదన్ మోహన్ లాగే ప్రతి ఒక్క నాయకుడు ఉండాల్నారు. బురుగిద్ద వద్ద ఇసుక మేటలు వేసిన పొలాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ క్రమంలో తమకు జరిగిన నష్టాన్ని రైతులు వివరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారు.వరదలకు మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు దెబ్బతిన్నాయన్నారు. . పోచారం ప్రాజెక్టు వరదలకు తట్టుకుని నిలబడి మిమ్మల్ని కాపాడిందని సీఎం అన్నారు. ప్రత్యక్షంగా మీ కష్టాలను, జరిగిన నష్టాలను చూడటానికే ఇక్కడకు వచ్చాం. శాశ్వత పరిష్కారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాం. పంటపొలాల్లో ఇసుక మేటలు తొలగించుకునేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామన్నారు,. పంట నష్టపరిహారం అందిస్తాం. రోడ్లు, ప్రాజెక్టులను మరమ్మతులు చేసేందుకు అధికారులు అంచనాలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు పూర్తిస్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేయాలి’ అని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.
……………………………………..
