* కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం గద్దెల విస్తరణ ప్రణాళికలు
ఆకేరు న్యూస్, ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ దేవతల గద్దెల విస్తీర్ణ లో
కొత్త మాస్టర్ ప్లాన్ అమలు లో భాగంగా భక్తుల సౌలభ్యం కొరకు క్యూలైన్ ల ఏర్పాటు కు చర్యలు తీసుకోనుటకు జిల్లా కలెక్టర్ జెసి దివాకర ఎస్పీ శబరిష్ లు గద్దెల పరిసరాలు పరిశీలించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం కొత్త మాస్టర్ ప్లాన్ అమలు లో భాగంగా గద్దెల ప్రకారం విస్తరణ ప్రణాళికలకు దేవాదాయ శాఖ అధికారులతో పాటు, పోలీస్ అధికారులు భద్రతా ఏర్పాట్లకు అనుగుణంగా స్థలాన్ని పర్యవేక్షించారు.
కలెక్టర్, ఎస్పి, శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం ప్రాంతం చుట్టూ కలియ తిరుగుతూ
కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలు వరుస ప్రకారం విస్తరణ ప్రణాళికలు, సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనం కొరకు భక్తులు సౌలభ్యం గా క్యూలైన్ ల ఏర్పాటు, వి ఐ పి, వి వి ఐ పి ల, ఎంట్రి తదితర అంశాలను క్షుణ్ణంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వీరస్వామి, ములుగు డి.ఎస్.పి రవీందర్, దేవదాయ శాఖ డి ఈ సి హెచ్ రమేష్ బాబు, సంబంధిత అధికారులు, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
…………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
