
ఆకేరున్యూస్, వరంగల్ : ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరంగల్ అండర్ బ్రిడ్జి వద్ద నడుం లోతు వరకు నీరు చేరడంతో అండర్ బ్రిడ్జి కిందినుంచే వేళ్లే రెండు బస్సులు నీళ్లలో చిక్కకున్నాయి.రెండు బస్సుల్లో కలిపి దాదాపు వంద మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మిల్స్ కాలనీ పోలీసులు హుటాహుటిన చేరుకొని తాడు సహాయంతో బస్సులో ఉన్న ప్రయాణికులనుఏ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.ప్రస్తుతం ఈ రహదారిని మూసివేసి వాహనాలను ఇతక మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు.
…………………………………………………………………………….