
* మాజీ మంత్రి హరీష్ రావు
ఆకేరు న్యూస్ ,డెస్క్ : రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి దయనీయంగా ఉందని
మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు.ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఆదివారం
పేర్కొన్నారు. గురుకులాల్లో విద్యార్థుల పరిస్థితి పై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గురుకులాల్లో ఎలుకలు,విష పురుగులు,పాములు స్వైర విహారం చేస్తున్నాయని విద్యార్థులు భయంతో ఉంటున్నారని తెలిపారు. ఫుడ్ పాయినజింగ్ తో ఆస్పత్రుల పాలవుతున్నారని అన్నారు
గురుకులాల్లో పని చేస్తున్న సిబ్బందికి రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని పేరక్కొన్నారు
294 ఉన్న గురుకులాలని కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయిన తరువాత1024 కు పెంచారని హరీష్ రావు పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గురుకులాల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని అన్నారు
……………………………………….