
* నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏ త్యాగానికైనా సిద్ధం
* కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తన నియోజకవర్గానికి అన్యాయం జరిగితే ఊరుకోనని, అవసరం అయితే ప్రభుత్వంతో అయినా పోరాటం చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati reddy Rajagopal reddy) అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరిగి కాంగ్రెస్ పార్టీ(Congress Pargy)లో చేరే సమయంలో మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, ఆలస్యం అయినా పర్వాలేదు ఎదురు చూస్తా అని కీలక వ్యాఖ్యలు చేశారు. చివరకు న్యాయం జరుగుతుందన్న ఆశతో ఉన్నానన్నారు. రీజినల్ రింగు రోడ్డు బాధితుల కోసం ప్రభుత్వంతో పోరాడైనా వారికి న్యాయం చేస్తానని చెప్పారు. అవసరం అయితే ఎటువంటి త్యాగానికైనా సిద్ధం అన్నారు. కార్యకర్తలు, అభిమానులు కూడా సిద్ధంగా ఉండాలని సూచించారు. గతంలో మునుగోడు అభివృద్ధిని పట్టించుకోకపోతే రాజీనామా చేసి ప్రభుత్వాన్ని తమ కాళ్ల వద్దకు వచ్చేలా చేశానని పేర్కొన్నారు. గతంలో తన రాజీనామా వల్ల చౌటుప్పల్ (Choutuppal) లో వంద పడకల ఆస్పత్రి, గట్టుప్పల్ మండలం, చండూరు రెవెన్యూ డివిజన్ తదితర మేలు జరిగాయని గుర్తు చేశారు. తన ప్రాంత ప్రజల తర్వాతే పదవైనా.. ఏదైనా అని రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
………………………………………………