
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం సమ్మక్క సారలమ్మ జాతర పరిసరాలలో గల జంపన్న వాగులో ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది .వివరాల ప్రకారం జనగామ జిల్లాకు చెందిన కానుగంటి మల్లేష్ 23 తన స్నేహితులతో కలిసి మేడారం అమ్మవార్ల దర్శ నానికి వచ్చారు. సమ్మక్క సారలమ్మ గద్దెల దర్శనం అనంతరం మొక్కులు కానుకలు చెల్లించారు. వెంటనే స్నేహితులతో కలిసి సమీపంలోని జంపన్న వాగులోకి వెళ్లారు ప్రమాదవశాత్తు మనీష్ వాగులో మునిగి గల్లంతయ్యారు. తోటి స్నేహితులు వాగులో గాలింపులు చేపట్టినప్పటికీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు ఆర్డిఎఫ్ బృందానికి సమాచారం అందించారు .వెంటనే రంగంలోకి దిగిన ఆర్డిఎఫ్ బృందం ఎట్టకేలకు మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ రెవెన్యూ ఆర్ డి ఎఫ్ బృందం గజ ఈతగాళ్లు పాల్గొన్నారు.
…………………………………….