
* కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి
ఆకేరు న్యూస్ డెస్క్ : ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించడానికే బీఆర్ ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండాలని బీఆర్ ఎస్ తీసుకున్న నిర్ణయం నేపధ్యంలో ఆయన ఈ విధంగా ట్వీట్ చేశారు. బీఆర్ ఎస్ కు రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. ఆ నలుగురు ఎంపీలను ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని కేసీఆర్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపధ్యంలో సామ రామ్మోహన్ రెడ్డిబీఆర్ ఎస్ బీజేపీలు రెండే ఒక్కటేనని బీజేపీకి పరోక్షంగా సహాయం చేయడానికి బీఆర్ ఎస్ ఉప్ రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. రాజ్యాంగం మనుగడే ప్రశ్నార్థకమైన సందర్భంలో బీఆర్ ఎస్ ఇలాంటి నిర్ణయం తీసుకోవండం శోచనీయమని పేర్కొన్నారు.
……………………………………