
* భారీగా ఎగసిపడ్డ మంటలు
ఆకేరు న్యూస్,హైదరాబాద్ : కంటైనర్ లారీ ప్రమాదవశాత్తు దగ్ధమైన ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద సోమవారం చోటుచేసుకుంది.హైదరాబాద్ నుంచి నాగ్పూర్ కు వెళ్తున్న కంటైనర్ లారీ ఇందల్వాయి టోల్ ప్లాజా వద్దకు చేరుకోగానే ట్యాంక్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే టోల్ ప్లాజా సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ మంటలు ఎంతకూ ఆరకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు.
……………………………………….