
* ఎరువుల సరఫరాపై కేంద్రం వివక్ష చూపుతోంది
* బీజేపీ, బీఆర్ ఎస్ కుమ్మక్కయ్యాయి
* మంత్రి పొన్నం ప్రభాకర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
కు( RAMCHANDER RAO) ఎరువుల కొరత గురించి తెలియదా అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్(PONNAM PRABHAKAR) ప్రశ్నించారు.సోమవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఎరువుల విషయంలోకేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణ పై వివక్ష చూపుతోందన్నారు. బీజేపీ బీఆర ఎస్ లు రెండూ కుమ్మక్కై ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎరువుల తయారీ సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్రానిదేనని అన్నారు. రాష్ట్రంలో ఎరువుల సమస్య ఉందనేది వాస్తవమన్నారు. ఈ సమస్యకు బాధ్యత వహించాల్సిన వాళ్లు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు అర్థం లేకుండా మాట్లాడుతున్నారని పొన్నం అన్నారు. రైతుల సమస్యలను పట్టించుకునే బాధ్యత రాంచందర్ రావుకు లేదా అని నిలదీశారు. కేంద్రంలోని పెద్దలతో మాట్లాడా రాష్ట్రానికి ఎరువులను మంజూరు చేసే విధంగా చూడాలని కోరారు. ముఖ్యమంత్రి,వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో సహా మంత్రులందరం కేంద్రలోని మంత్రులను కలిసి ఎరువుల సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశామని పొన్నం గుర్తు చేశారు. కేంద్రం కావాలనే తెలంగాణ పై వివక్ష చూపుతోందని ఆరోపించారు.
……………………………………………………………………………………