* జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలవాలని ఆకాంక్ష
ఆకేరున్యూస్, హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి ఎన్నికపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బిడ్డ న్యాయకోవిదుడు,రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉప రాష్ట్రపతిగా గెలవాలని ఆమె ఆకాంక్షించారు. కాళోజీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కవిత మీడియాతో మాట్లాడారు. సామాజిక తెలంగాణ సాధన కోసమే తాను కృషి చేస్తున్నానని చెప్పుకొచ్చారు. కేసీఆర్ తిరిగి సీఎం అయితే సామాజిక తెలంగాణ సాధ్యమయ్యేదని ఆమె అన్నారు.అన్ని వర్గాలకు న్యాయం చేయడమే జాగృతి లక్ష్యమని కవిత పేర్కొన్నారు.సామాజిక తెలంగాణ సాధన కోసం అన్ని పార్టీలను కలుపుకొని ముందుకుపోతామన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా ఆమె కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
……………………………………………
