* చాకలి ఐలమ్మకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళి
ఆకేరు న్యూస్ డెస్క్ : అణచివేత, దమనకాండలపై ధిక్కార పతాకాన్ని చాకలి ఐలమ్మ ఎగురవేశారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఢిల్లీలోని ఆయన నివాసంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ గడ్డపై దొరల అహంకారానికి, నిరంకుశత్వానికి వ్యతరేకంగా 80ఏళ్ల కిందటే జంగ్ సైరన్ ఊదిన యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు. సమ్మక్క, సారక్క, చాకలి ఐలమ్మల స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీలు పోరిక బలరాం నాయక్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
