MLA Kadiyam Srihari GCDO
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిసిడిఓ గౌసియా బేగం పై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజవరం కేజిబివిలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ఎమ్మెల్యే మంగళవారం హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిసిడిఓ, కోఆర్డినేటర్ అంటే ఊరికెనే తిరగడం కాదని, ఉత్తమ ఫలితాల కోసం కృషి చేయాలన్నారు. కేజీబీవీలో సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలి తప్ప వట్టిగా తిరగరాదన్నారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తుందని పర్యవేక్షణ అధికారులు సక్రమంగా పనిచేయకపోవడం, సత్ ఫలితాలు లేకపోవడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా కోఆర్డినేటర్ తన బాధ్యతని సక్రమంగా నిర్వహించి కస్తూర్బా గాంధీ పాఠశాలలో కళాశాలలో విద్యార్థులు మంచి ఫలితాలు తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని ఆదేశించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
