
* బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి
ఆకేరు న్యూస్ ములుగు: ములుగు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.మొదట చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి హాజరైన అధికారులు, సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆమె వీరోచిత గాథను స్మరించుకున్నారు.బీసీ వెల్ఫేర్ అధికారి తుల రవి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ చరిత్రలో మహిళా శక్తి ప్రతీకగా నిలిచారు. భూస్వాముల దౌర్జన్యాలకు తలొగ్గకుండా రైతుల పక్షాన నిలబడి పోరాడారు. ఆమె త్యాగస్ఫూర్తి, ధైర్యసాహసాలు నేటి యువత స్ఫూర్తి గా తీసుకోవాలన్నారు.
ఐలమ్మ చరిత్రను విద్యార్థులకు పరిచయం చేయాలని, పాఠశాలల్లో ఆమె వీరోచిత పోరాటాలను ప్రత్యేక వ్యాసాల రూపంలో బోధించాలని సూచించారు. కార్యక్రమములో మణికంట రజక సంఘం అధ్యక్షుడు, చాకలి ఐలమ్మ వర్ధంతి & జయంతి కమిటి అధ్యక్షుడు నగరపు రమేష్ , మణికంట రజక సంఘం ప్రధాన కార్యదర్శి చాపర్తి రాజు, మణికంట రజక సంఘం కోశాధికారి ఎన్నిండ్ల మహేందర్, ఉపాధ్యక్షుడు పరికిరాల రవి, సహాయ కార్యదర్శి గూడెళ్ళి ఓదెలు, సలహాదారులు నేరెళ్ళ శంకర్ , జాలిగం శ్రీనివాస్ , NHRC అధ్యక్షుడు మోగుళ్ళ భద్రయ్య, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు సారంగపాణి BC వెల్ఫేర్ శాఖా ఉద్యోగులు సరిత, మానస, సాడలు, కుమారస్వామి, ప్రతాప్, మరియు నాల్గోవ తరగతుల ఉద్యోగులు పాల్గొన్నారు.
……………………………………..