
* రోజురోజుకూ పెరుగుతున్న పిడుగుపాటు మరణాలు
* తెలంగాణలో ఒక్క రోజులోనే 9మంది మృతి
* అందరూ వ్యవసాయ కూలీలే..
* అవగాహన లోపమే కారణమా..?
ఆకేరు న్యూస్,డెస్క్ : ఈ మధ్య కాలంలో పిడుగుపాటుకు మృతి చెందిన సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. నిన్న బుధ వారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాల్లో 9 మంది మృతి చెందారు. వారిలో ఒకరు పశువుల కాపరి కాగా మిగతా వారందరూ వ్యవసాయ కూలీలే.. గద్వాల జిల్లా అయిజ మండలం భూంపూర్ గ్రామంలో ముగ్గురు వ్యవసాయ కూలీలు, సర్వేసు,పార్వతి,సౌభాగ్య పిడుగుపాటుకు మృతి చెందారు. అలాగే నిర్మల్ జిల్లా పెంబి మండలం గుమ్మెన ఎంగ్లాపూర్ లో పొలంలో పనిచేసుకుంటున్నభార్యాభర్తలు ఎల్లయ్య,లక్ష్మి మరో వ్యక్తి వెంకన్న మృత్యు వాత పడ్డారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాయం నర్సయ్య,ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యనారాయణ పురంలో పశువులు కాపరి మహేష్ మడిపల్లిలో వీరభద్రరావు, మరణించారు.
అవగాహనా లోపమే..కారణం
ఒక్క సారిగా వర్షం కురిసి ఎటూ పోలేని పరిస్థితుల్లో పిడుగును తప్పించుకోలేం కానీ వర్షం వచ్చే సూచనలు ఉండి తగిన సమయం ఉన్నప్పుడు అందరూ పిడుగు పడకుండా సురక్షితంగా మనల్ని మనం కాపాడుకోవచ్చు. బుధవారం ఒక్క రోజులోనే పిడుగుపడి 9 మంది మృతి చెందారు. అందులో ఒకరు వ్యవసాయ కూలీ కాగా మిగతా వారు అందరూ వ్యవసాయకూలీలు లేక పొలంలో పనిచేసుంటున్న వారే.. కావడం గమనార్హం..పిడుగునుంచి ఎలా కాపాడుకోవాలో ఎలాంటి ప్రాంతాల్లో ఉంటే పిడుగు పడుతుందో.. ఎలాంటి వస్తువలు పిడిగును ఆకర్శిస్తాయో తెలియక పోవడం వల్ల ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి.
పిడుగు నుంచి ఇలా తప్పించుకోవచ్చు..
పిడుగునుంచి ఎలా మనల్ని మనం కాపాడుకోవచ్చో..వరంగల్ నిట్ కాలేజీకి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి ఆకేరు ప్రతినిధికి చక్కగా వివరించారు. ఇనుప వస్తువులు గడ్డపారలు,పారలకు దూరంగా ఉండాలని సూచించారు.సాధారణంగా వ్యవసాయ కూలీలే ఇలాంటి పనిముట్లను వాడుతారు. ఇనుము వస్తువులకు విద్యుత్ వాహకత ఎక్కువగా ఉంటుంది. నిన్న మరణించిన 9 మంది వ్యవసాయకూలీలు కావడం గమనార్హం.అలాగే నీటికి విద్యుత్ వాహకత ఎక్కువగా ఉంటుంది. నీటికి దూరంగా ఉండాలని లక్ష్మారెడ్డి సూచించారు. పొలం పనులు చేసుకుంటున్న వ్యవసాయదారులే పిడుగు పాటు తో మరణిస్తున్నారని మనం గమనించాలి. పొలంలో దిగి పనిచేస్తుండగా పిడుగు పడి మరణించిన సంఘటనలు గతంలో జరిగాయి ఇంకా జరుగుతున్నాయి. అలాగే కరెంట్ స్తంభాల వద్ద నిలబడకూడదని ప్రొఫెసర్ లక్ష్మా రెడ్డి సూచించారు. అలాగే వర్షం వచ్చినప్పుడు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి.
ఇంట్లో కరెంట్ ఉపకరణాలు ఫ్యాన్లు,లైట్లు,టీవీలు ఆఫ్ చేసుకోవాలి. ఒక వేళ కారులో ప్రయాణిస్తున్నట్లయితే కారులో నుండి దిగకుండా కారులోనే ఉండిపోవాలి. కొంతమంది వర్షం పడుతుందని దగ్గరగా ఉన్న చెట్ల కిందకి పరుగులు తీస్తారు, చెట్ల కిందకు అస్సలుపరుగెత్త కూడదు. చెట్లు మంచి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. పిడుగును తొందరగా ఆకర్శిస్తాయి. చేతికి పెట్టుకున్న ఉంగరాలు కూడా పిడుగును ఆకర్శిస్తాయని ప్రొఫెసర్ తెలిపారు.
సెల్ ఫోన్లు,,ఆఫ్ చేయాలి
నేడు సెల్ ఫోన్ల వాడకం తప్పనిసరి అయింది. ప్రతీ ఒక్కరి వద్ద సెల్ ఫోన్ ఉంటుంది. సెల్ ఫోన్ లేకుంటే మనుగడ లేని పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా డిజిటల్ కరెన్సీ వచ్చిన తరువాత ఫోన్ లేకుంటే జీవించలేని పరిస్థితి ఉంది. వర్షం పడుతున్న సమయంలో ఫోన్ కు దూరంగా ఉండాలి. సెల్ ఫోన్ మంచి విద్యుత్ వాహకం పిడుగును ఆకర్షించడమే కాదు.. ఉరుములు మెరుపులు వచ్చినప్పడు ఫోన్ పేలిపోయే అవకాశం ఉంది. వర్షం పడే సమయంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలని ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి సూచించారు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే పిడుగు నుండి మనల్పి మనం కాపాడుకోవచ్చు.
…………………………………………………………………………