
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఇప్పగూడెం గ్రామంలో సంఘటన జరిగింది .పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేనత్త కొండ గొర్ల ఎల్లమ్మ 50 ను అదే గ్రామానికి చెందిన మేనల్లుడు కొండ గొర్ల విజయకుమార్ గొడ్డలితో అతికిరాతకంగా దాడి చేసి చంపేశాడు . విజయ్ కుమార్ జల్సాలు, మద్యానికి బానిస అయ్యారు.డబ్బులు ఇవ్వాలని మేనత్తను డిమాండ్ చేశాడు .ఆమె డబ్బు లు ఇవ్వనని నిరాకరించి బయటికి వెళ్లడంతో ఎదురు తిరిగి గొడ్డలితో హతమార్చాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఎల్లమ్మ మృతదేహా న్ని చూసిన స్థానికులు నిర్గాంతపోయారు . నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లోంగిపోయాడు. సిఐ ముత్యం రమేష్ ఎస్సై కొప్పుల తిరుపతిరావు సంఘటన స్థలాన్ని వెళ్లి పరిశీలించారు. బంధువులు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
———————————————–