* చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఐక్యవేదిక ఆధ్వర్యలో..
* భారీగా హాజరైన బాధితులు
* పోలీసుల మోహరింపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మాకొద్దు మాకొద్దు త్రిబుల్ ఆర్ మాకొద్దు అంటూ భారీ ఎత్తున రైతులు చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట RRR భూ నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ధర్నా శుక్రవారం నిర్వహించారు. ఈ ధర్నాకు భారీ సంఖ్యలో భూ నిర్వాసితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని, చౌటుప్పల్లో హెచ్ఎండిఏ పరిధి నుంచి త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. త్రిబుల్ ఆర్ వల్ల చౌటుప్పల్ రెండుబాగాలుగా విడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఓఆర్ ఆర్ నుంచి ఆర్ ఆర్ ఆర్ అన్ని రహదారులకు 40 కిలోమీటర్ల పైన తీసుకున్నారన్నారు. నేషనల్ హైవేపై కూడా 40 కిలోమీటర్ల పైన తీసుకోవాలని, ప్రాణం పోయినా త్రిబుల్ ఆర్ కు భూములు ఇవ్వమని ఆందోళన చేశారు. త్రిబుల్ ఆర్ లో భూములు కోల్పోతున్న నిర్వాసితులను ఆదుకోవాలని, బహిరంగ మార్కెట్ ధర నష్టపరిహారం రైతులకు ఇవ్వాలని, త్రిబుల్ ఆర్ లో భూములు కోల్పోతున్న రైతులకు భూమికి భూమి ఇవ్వాలని, త్రిబుల్ ఆర్ లో భూములు, ప్లాట్లు కోల్పుతున్న వారికి భూములు,ప్లాట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆర్డీవో కార్యాలయం వద్దు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
……………………………………………
