* ప్రభుత్వ యంత్రాగాలు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కార్ నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా? అంటూ ఎక్స్ వేదికగా స్పందించారు.
కేటీఆర్ ట్వీట్ ఇలా..
ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల
నగరంలో నిన్న ఒక చిన్నారి
తెరిచి ఉంచిన మ్యాన్హోల్లో పడిపోయింది.
అదృష్టవశాత్తూ పాప ప్రాణాలు దక్కాయి.
చేసిన తప్పును దిద్దుకోవాల్సిన మున్సిపల్ శాఖలోని
మూడు విభాగాలేమో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.
తప్పు హైడ్రాది అని జీహెచ్ఎంసీ ప్రకటిస్తే
తప్పు మాది కాదు జలమండలిది అని హైడ్రా చేతులు దులుపుకుంది
ఆ వెంటనే అసలు మాకేం సంబంధం లేదని జలమండలి చేతులెత్తేసింది!
మున్సిపల్ శాఖను కేవలం కాసుల వేటకు
వాడుకోవడంలో రేవంత్ బిజీగా ఉంటే,
ఆయన శాఖలోని విభాగాలేమో
సమన్వయలేమితో నగరవాసులకు
ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి.
………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
