* ఢిల్లీలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
ఆకేరు న్యూస్, డెస్క్ : బాలికల చేతిలో ఓ బాలుడు దాడి గురై గాయాలపాలై ఆస్పత్రిలో చేరిన ఘటన గురువారం ఢిల్లీలో ని రోహిణి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడు చదువుతున్న స్కూల్ లో ఓ బాలికతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానకి గురైన సదరు బాలిక వేరే స్కూల్ లో చదువుతున్న తన అక్కకు విషయాన్ని తెలియ చేసింది. దీంతో బాలుడుకి గుణపాఠం చెప్పాలనుకు ఇద్దరు అక్కా చెళ్లెల్లు మరో ఇద్దరు స్నేహితురాళ్ల సహాయంతో గురువారం సాయంత్రం బాలుడు స్కూల్ వద్ద కాపు కాచారు. బాలుడు స్కూల్ నుండి ఇంటికి వెళ్తుండగా దారి కాచి బాలుడుపై బ్లేడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స చేసి మొత్తం 50 కుట్లు వేశారు. బాలుడి ప్రాణానికి ఎలాంటి అపాయం లేదని వైద్యులు తెలిపారు.
………………………………..
