
* అమరుల త్యాగాలతోనే తెలంగాణ
* బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
ఆకేరున్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదిరిద్దాం అని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.సెప్టెంబర్ 17 ను కొందరు విమోచన దినం అని మరికొందరు విలీన దినం అని అంటున్నారని,కానీ రాచరిక వ్యవస్థలో నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి సమైక్యమైన రోజు కాబట్టి జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తున్నామని అన్నారు. తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా.. పోరాటాల గడ్డ.అని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమందని అన్నారు.షేక్ బందగీ, దొడ్డి కొమురయ్య, ఆరుట్ల కమలమ్మ, ఆరుట్ల రామచంద్రారెడ్డి, రావి నారాయణరెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో త్యాగాలు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. గ్రూప్ 1 పరీక్ష రాసిన అభ్యర్థులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. రైతులు యూరియా కోసం పడిగాపులు పడే పరిస్థితి దాపురించిందని అన్నారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. రైతు రాజ్యం,సంక్షేమ రాజ్యం కావాలంటే అది ఒక కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని కేటీఆర్ అన్నారు.ఆనాటి పోరాట యోధుల త్యాగాల సాక్షిగా తెలంగాణ బిడ్డలు మరోసారి పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది అని కేటీఆర్ గుర్తు చేశారు.
…………………………………..