
* అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలి
* పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఉండాలి
* నూతన విద్యా విధానంపై అధికారులతో సీఎం సమీక్ష
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : విద్యావిధానంలో చాలా లోపాలు ఉన్నాయని
వాటిని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
బుధవారం ఆయన నూతన విద్యావిధానంపై అధికారులతో సమీక్షా సమావేశం
నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నేటి విద్యార్థులకు అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అవసరం అని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నామన్నారు, విద్యా విధానం లో సమూల మార్పులు, ప్రక్షాళన జరిగి తీరాల్సిందే అని అన్నారు. విద్యా వ్యవస్థలో మార్పు తేవడం మాత్రమే కాదు… పేదరిక నిర్మూలన సాధించేలా ఉండాలని అన్నారు. విద్యారంగంలో గతంలో ఉస్మానియా,కాకతీయ యూనివర్సిటీ లు కీలక పాత్ర పోషించాయి. ఏడాదికి 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతుంటే… వారి లో 15 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారని రేవంత్ అన్నారు. నాణ్యత, నైపుణ్యత కొరవడటం సమస్యకు కారణమని రేవంత్ అన్నారు. . పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గం అని , విద్యా విధానం లో సమూల మార్పులు తీసుకురావడమే నా ధ్యేయం అని సీఎం అన్నారు. నూతన విద్యా పాలసీ ఆ దిశగా రూపకల్పన జరగాలని మేధావులు, విద్యాధికుల నుండి సూచనలు, సలహాలు తీసుకుని కొత్త పాలసీ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ పాలసీ దేశ విద్యా వ్యవస్థకు ఆదర్శంగా ఉండాలని అన్నారు, 73 లక్షల మంది యువత కు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే నా తపన సఎం అన్నారు, ఒకటి నుంచి 12వ తరగతుల వరకు సమూల మార్పులు జరగాలని సూచించారు. ఈ సమీక్షలో ఎంఎల్సీ శ్రీ కోదండరాం, శ్రీ కె కేశవ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, శ్రీ ఆకునూరి మురళి, శ్రీ శ్రీపాల్ రెడ్డి, శ్రీ ఏవీఎన్ రెడ్డి, శ్రీ మల్క కొమరయ్య,
విద్యావేత్తలు,అన్ని యూనివర్సిటీ ల వైస్ చాన్సలర్స్ లు ఎడ్యుకేషన్ సెక్రటరీ శ్రీమతి యోగితా రాణా, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ శ్రీ బాల కిష్టా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
………………………………………………