
* రైతులను కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారు
* రైతుల విషయంలో రాజకీయాలు చేయవద్దు
* హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్
ఆకేరు న్యూస్, కమలాపూర్: రాష్ట్రంలో యూరియా కొరతకు కారణం కేంద్రంలో ఉన్న బీజేపీ అని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వొడితల ప్రణవ్ అన్నారు. బుధవారం కమలాపూర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి ఢిల్లీలో యూనియన్ మినిస్టర్ ని కలిసి లక్ష టన్నుల యూరియా అవసరం ఉందన్నప్పటికీ, కావాలనే కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని రానున్న రెండు, మూడు రోజుల్లో యూరియా కొరత తీరుతుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలకు యూరియా సరఫరా చేసేది తామేనని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇటీవల ఇంటర్వ్యూలో చెప్తుంటే ,ఈటెల రాజేందర్ మాత్రం యూరియా సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని అంటున్నారని అన్నారు. గత సంవత్సరం యూరియా సరఫరా సాఫీగా జరిగిందని, కానీ ప్లానింగ్ సరిగా లేదంటూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా యూరియా కొరత ఉందని వారికి కూడా ప్లానింగ్ లేదా అని అన్నారు. రైతు సమస్యల పైన దయచేసి రాజకీయం చేయొద్దని హితవు పలికారు.
త్వరలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ
బుధవారం కమలాపూర్ లోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వొడితల ప్రణవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కట్టించి నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రజా ప్రభుత్వంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చొరవతో కమలాపూర్ లో 350, గూడూరులో 50, మరిపెళ్లిగూడెంలో 50 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను త్వరలో అర్హులైన వారికి అందించనున్నట్టు వొడితల ప్రణవ్ అన్నారు. మిగిలిన డ్రైనేజీ పనులు ఎలక్ట్రిసిటీ పనులు జరుగుతున్నాయని, పనులు పూర్తయిన వెంటనే నెల రోజుల్లో గుంట భూమి లేనీ, L2 లిస్టులో ఉన్న నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేయనున్నట్టు ప్రణవ్ తెలిపారు.
……………………………………….