
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : భారత బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ ( Lindy Cameron) డిప్యూటీ హైకమిషనర్ హైదరాబాద్ గారెత్ విన్ ఓవెన్ ( Gareth Wynn Owen), పొలిటికల్ ఎకానమి అడ్వైజర్ నళిని రఘురామన్ లు గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా UK ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ స్కాలర్ షిప్ ( Chevening scholarship)ను కో-ఫండింగ్ ప్రాతిపదికన తెలంగాణ మెరిట్ విద్యార్థులకు అందించాలని సీఎం వారిని కోరగా వారు అంగీకారం తెలిపారు.రాష్ట్రంలో ప్రభుత్వం అమలుచేయనున్న నూతన విద్యావిధానం గురించి సీఎం రేవంత్ రెడ్డి వారికి వివరించారు. ఎడ్యుకేషన్, టెక్నాలజీ రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారు తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటీష్ కంపెనీలు భాగస్వాములు కావాలని సీఎం కోరారు. GCC , ఫార్మా, నాలెడ్జ్ విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరగా వారు సానుకూలంగా స్పందించారు.