
* తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : తెలంగాణలోని గురుకులాల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3,488 ఖాళీలను భర్తీ
చేయనున్నారు. ఈ ఖాళీలను ఔట్ సోర్సింగ్ పద్దతి ద్వారా నియమిస్తారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేసి.. 31 విభాగాల్లో అవసరమైన సిబ్బందిని నియమించడానికి అనుమతి ఇచ్చారు. 31 విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. వాటిలో ప్రోగ్రామర్, సీనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేటర్ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు.. ప్రిన్సిపల్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ, పీడీ పోస్టులు కూడా ఉన్నాయి. అన్ని విభాగాల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు అత్యధికంగా ఉన్నాయి. దాదాపు 1227 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. లైబ్రేరియన్ పోస్టులు దాదాపు 43 ఉన్నట్లు తెలుస్తోంది. స్టాఫ్ నర్స్ పోస్టులు 42 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.