
* హైదరాబాద్‌తో పాటు.. వరంగల్ లో కూడా..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఎన్స్ఫోర్ట్మెంట్ డైరెక్టరేట్ అధికారుల (ED Raids) సోదాలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం నుంచి సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లో ప్రముఖ వ్యాపారవేత్త బూరుగు రమేశ్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. రమేశ్‌తోపాటు ఆయన కుమారుడు విక్రాంత్ నివాసంలోనూ సోదాలు జరుపుతున్నారు. రెండు బృందాలుగా విడిపోయిన ఈడీ అధికారులు అల్వాల్, మారేడుపల్లిలో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. సోదాల్లో పలు కీలక పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కాస్పో లీగల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మహాదేవ జ్యూవెలర్స్తో పాటు రాజశ్రీ ఫుడ్స్‌లో బూరుగు విక్రాంత్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. మహాదేవ జ్యూవెలర్స్‌లో బంగారం కొనుగోలు, అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. మహాదేవ్ జ్యూవెలర్స్ తోపాటు మరికొన్ని కంపనీలకు కూడా డైరెక్టర్‌గా ఉన్నారు విక్రాంత్. ఈరోజు రాత్రి వరకు ఈడీ సోదాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఐటీ రైడ్స్..
మరోవైపు ఐటీ అధికారుల సోదాలు (IT Raids) కొనసాగుతున్నాయి. వాసవి గ్రూప్ తోపాటు, కలాసా జ్యువెలరీ, క్యాప్స్ గోల్డ్ సంస్థలు ఐదేళ్లలో చెల్లించిన పన్నులపై అధికారు ఆరా తీస్తున్నారు. క్యాప్స్ గోల్డ్ కంపెనీ డైరెక్టర్ చందా శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. చందా కుటుంబ సభ్యులు, డైరెక్టర్లుగా ఉన్న పలు కంపెనీల్లో కీలక ఆధారాలను ఐటీ అధికారులు సేకరించారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్ లోనూ ఐటీ దాడులు జరుగుతున్నాయి. చందా శ్రీనివాసరావుతో పాటు, చందా అభిషేక్, చందా సుధీర్ నివాసాల్లోను ఐటీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. అటు వాసవి బిల్డర్స్పై కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి.