
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ (NTR) ప్రమాదానికి గురయ్యారు. స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే ఎన్టీఆర్ ఆరోగ్యం గురించి ఆందోళన అవసరం లేదని ఆయన కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. హైదరాబాద్(HYDERABAD)లో జరుగుతున్న ఓ యాడ్ షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారు. అనుకోకుండా ప్రమాదం జరిగి ఆయన కాలికి స్వల్ప గాయమైంది. వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో కిందపడటంతో గాయమైంది. వెంటనే వ్యక్తిగత సిబ్బంది ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. సోషల్ మీడియా(SOCIAL MEDIA)లో దీనిపై ప్రచారం జరగడంతో ఎన్టీఆర్ కార్యాలయం అప్రమత్తమైంది. ఆయనకు చిన్న గాయమే అయిందని, ఆందోళన అవసరం లేదని ప్రకటన విడుదల చేసింది. ఎన్టీఆర్ అనారోగ్యంపై వచ్చే ఊహాగానాలను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. దయచేసి ఫ్యాన్స్ కానీ, మీడియా కానీ లేనిపోని వార్తలను ప్రచురించవద్దని కోరింది. ఆయన రెండు వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
…………………………………………..