* మూడు రాష్ట్రాల్లో 8 మంది అరెస్ట్
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ సీఐడీ అధికారులు మూడు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి 8 మందిని అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో గుజరాత్,రాజస్థాన్ పంజాబ్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరు ప్రాంతాల్లో సర్వర్లు ఏర్పాటు చేసుకొని యాప్ లను నిర్వహిస్తున్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఆరు ప్రాంతాల్లో రైడ్ చేసి హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు.అరెస్ట్ అయిన వారిలో తాజ్ 0077, ఫైరీప్లే లైవ్,ఆంధ్రా365,వీఎల్ బుక్, తెలుగు 365 యస్ 365 సంస్థల నిర్వాహకులను అరెస్ట్ చేశారు.ఎంతో మంది అమాయకులు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా బడ్డులను కోల్పోయారు. విదేశాల్లో ఉండి నిర్వహిస్తున్న వారిని పట్టుకునేందుకు సీఐడీ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.
………………………………
