
* త్వరలో నియామకాల ప్రక్రియ ప్రారంభం
* టాప్ టెన్ లో ఆరుగురు మహిళలు
* మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 టాపర్లు మహిళలే..
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : గ్రూప్-1 తుది ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) బుధవారం రాత్రి 12 గంటల తరువాత విడుదల చేసింది. మొత్తం 563కుగాను 562 గ్రూప్-1 సర్వీసుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 563కుగాను 562 గ్రూప్-1 సర్వీసుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ సారి గ్రూప్ వన్ ఫలితాల్లో మహిళలు తమ సత్తా చాటారు టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 1 ఫలితాల తుది జాబితాలో టాప్ టెన్ లో ఆరుగురు మహిళలు ఉండడం విశేషం. మల్టీ జోన్ 1 లో టాపర్ గా హనుమకొండకు చెందిన జిన్నా తేజస్విని నిలువగా మల్టీజోన్ 2 లో హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ కు చెందిన లక్ష్మీదీపిక నిలిచారు. వీరిద్దరు కాకుండా టాప్ టెన్ లో మరో నలుగురు మహిళలు ఉన్నారు. కృతిక,అనూష, నిఖిత, భవ్యలు టాప్ టెన్ లో ఉండగా టాప్ 100లో 41 మంది మహిళలు ఉండడం విశేషం.
ఎంపికైన అభ్యర్థులు వీరే…
అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణుల జాబితాను తమ వెబ్సైట్లో ప్రచురించింది. తుది ఎంపికలో మల్టీజోన్-1లో 258, మల్టీజోన్-2లో 304 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశామని న్యాయవివాదం నేపథ్యంలో మరొక పోస్టును విత్‌హెల్డ్‌లో పెట్టినట్లు టీజీపీఎస్సీ కమిషనర్ బుర్రా వెంకటేశం వెళ్లడించారు.