
* ఎర్రవల్లిలో కేసీఆర్ కీలక సమావేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికపైనే పార్టీలన్నీ దృష్టి సారించాయి. ఆ ఎన్నికలో గెలుపును పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించి వ్యూహం రచిస్తున్నాయి. ఈక్రమంలోనే పార్టీ నేతలతో గులాబీ బాస్ కేసీఆర్ (KCR) కూడా కీలక సమావేశం నిర్వహించారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో ఈరోజు సమావేశం జరిగింది. జూబ్లీహిల్స్ (JUBILEEHILLS)ఉప ఎన్నికలపై ఆయన శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. తాజా రాజకీయ పరిస్థితులపైనా సమీక్షించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, జరుగుతున్న ప్రచారం తీరును అడిగి తెలుసుకున్నారు. నిన్న కీలక నేతలు బీఆర్ ఎస్‌లో చేరడంపై హర్షం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ సమావేశంలోనే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత(SUNITHA)ను అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. త్వరలోనే గ్రేటర్ ఎన్నికలు కూడా ఉండడంతో వాటిపై కూడా చర్చ జరిగింది. ఆయా డివిజన్లలో ప్రముఖ, కీలక నేతల జాబితా తయారు చేయాలని, వారికి ఇప్పటి నుంచే సరైన గైడెన్స్ ఇవ్వాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మహ్మద్ అలీ, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
………………………………………………..