ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆ రైలులో ఉగ్రవాదులు ఉన్నారు.. అన్న ఒక్క ఫోన్ కాల్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. రైలులోని ప్రయాణికులను భయాందోళనలకు గురి చేసింది. పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హౌరా నుంచి హైదరాబాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ((Falaknuma Express) రైలులో ఉగ్రవాదులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘట్కేసర్ వద్ద రైలును అపిన ప్రత్యేక బృందాలు.. ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఘట్కేసర్ పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. సుమారు అరగంట నుంచి రైలులో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికులు ప్రతిఒక్కరిని సరైన ధృవపత్రాలు చూపించాలని కోరుతున్నారు. సుమారు గంటకుపైగా లగేజీలను, ప్రయాణికులను పరిశీలించిన తర్వాత ఎటువంటి ముప్పూ లేదని పోలీసులు నిర్ధారించారు. అనంతరం రైలు సికింద్రాబాద్కు వెళ్లింది.
……………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
