
* హైకోర్టు సూటి ప్రశ్న
ఆకేరు సినిమా డెస్క్ : ఓజీ బెనిఫిట్ షోల ద్వారా వచ్చే వసూళ్లను వీధి పిల్లల సంక్షేమానికి అనాధ శరణాలయాలకు ఇస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది.. ‘ఓజీ’ బెనిఫిట్ షోలకు, ఆ సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులే కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులే అక్టోబర్ 9వ తేదీ వరకు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. టికెట్ ధరలు ఎందుకు పెంచాలనుకున్నారో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేవాలు జారీ చేసింది. మరోవైపు ఓజీ సినిమా ప్రపంచవ్యాప్తంగా 154 కోట్లకు పైగా వసూలు చేసిందని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్ మెంట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘ఓజీ’ బెనిఫిట్ షోలకు, ఆ సినిమా టికెట్ రేట్ల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్కు చెందిన బీ మల్లేశ్ యాదవ్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
…………………………………………..