* ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్
ఆకేరు న్యూస్, అమరావతి : అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవమైన వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చి శ్రీహరి దర్శనం, వాహన సేవల్ని తిలకించి పునీతులవుతున్నారు. తాజాగా తిరుమల బ్రహ్మోత్సవాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర ట్వీట్ చేశారు.
బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడవాహన సేవ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం తిరుమాఢ వీధుల్లో టీటీడీ అధికారులు అద్భుతంగా నిర్వహించారన్నారు. ఈ వాహన సేవలో పల్గొనేందుకు దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, వారికి మంచి అనుభూతిని కలిగించారని పేర్కొన్నారు. లక్షలాది మంది భక్తులను సమన్వయం చేయడంలో కీలకపాత్ర పోషించిన టీటీడీ బోర్డుకు, దేవస్థాన అధికారులకు, ఉద్యోగులు, శ్రీహరి సేవకులు, పోలీస్ ఉన్నతాధికారులు, జిల్లా అడ్మినిస్ట్రేషన్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గోంటున్న అశేష భక్తకోటికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎం చంద్రభాబు ఎక్స్‌లో పోస్టు చేశారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
