
* తెలంగాణ మంత్రులకు హరీశ్‌రావు సవాల్
* ప్రతి ఇంటికి బాకీ కార్డు పంపిణీ చేయాలి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దమ్ముంటే తెలంగాణ రాష్ట్ర మంత్రులు పోలీసులు లేకుండా బయట తిరగాలని బీఆర్ ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. మంగళవారం ఆయన సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల కార్యక్రమంలో పాల్గొని మాట్టాడారు. కాంగ్రెస్ పార్టీ అబద్దపు హామీలతో రాష్ట్ర జనం విసిగిపోయారన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు జనాల్లో తిరగాలంటే భయపడుతున్నారని అన్నారు. ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తారనే భయం వారిలో ఉందన్నారు. పోలీసులు లేకుండా నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేదని హరీష్ రావు అన్నారు. బాకీ కార్డు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పాలిట ఉరితాడవుతుందన్నారు. ఆరు గ్యారెంటీలపై ప్రశ్నిస్తారని రాహుల్‌గాంధీ కనీసం తెలంగాణ ముఖం కూడా చూడడంలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి రైతుకు రూ.75 వేల రైతు బంధు బాకీ పడిందన్నారు. ప్రతి మహిళకు బాకీ పడిన రూ.44వేలు ఇచ్చాకే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లు అడగాలన్నారు.ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేయాలన్నారు. ఊరూరా బెల్టు షాపులు, మైక్రో బ్రూవరీలు పెట్టి తాగుబోతుల తెలంగాణగా సీఎం రేవంత్‌రెడ్డి మారుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
………………………………………..