
– ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ఆకేరు న్యూస్, హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.మంగళవారం హుజురాబాద్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ 42% బీసీ రిజర్వేషన్ కి సంపూర్ణ మద్దతు ఎప్పటికీ ఉంటుందని అన్నారు.హుజురాబాద్ ప్రజలు చైతన్యవంతులనీ, ఏ పార్టీ హయాంలో అభివృద్ధి జరిగిందో వారికి బాగా తెలుసని అన్నారు. తెలంగాణ వాదానికి,కేసీఆర్ నాయకత్వంలో హుజురాబాద్ ప్రజలు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుల్లో టాప్ 20లో 19 అవార్డులు తెలంగాణకే వచ్చాయని కాబట్టి ప్రజలు ఆలోచించాలని అన్నారు. రైతులకు యూరియా సరఫరా చేయలేని ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదనీ, నియోజకవర్గంలో లక్షా 25 వేల ఎకరాల పారకం ఉన్న రైతులకి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, 24 గంటల కరెంటు ఇచ్చిన తర్వాతే ఓటు అడగాలని అన్నారు.కెసిఆర్ హయంలో రాజుగా ఉన్న రైతుని కాంగ్రెస్ ప్రభుత్వం బజారున పడేసిందని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న 6 గ్యారెంటీల్లో హుజురాబాద్ నియోజకవర్గానికి పడ్డ బాకీ కార్డులను ప్రతి ఇంటికి పంపిణీ చేస్తామన్నారు.రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థికి తాను పూర్తిస్థాయి అండగా ఉంటానని, ముందస్తు ఎన్నికల కోసం మండలాల వారీగా సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.ఎన్నికలు ఎప్పుడున్నా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని, నియోజకవర్గం లో ఉన్న 105 గ్రామపంచాయతీ 62 mptc 5 జడ్పీటీసీ 5 ఎంపీపీ స్థానాలను గెలుచుకుంటామన్నారు.కార్యక్రమం లో BRS నాయకులు పాల్గొన్నారు.
………………………………………………………