
ఆకేరు న్యూస్, కమలాపూర్ : స్థానిక ఎన్నికల వేళ మండలంలోని ఉప్పల్ పల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు బుధవారం హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రణవ్ సమక్షంలో పార్టీలో చేరారు. ప్రణవ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెడుతున్న పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ప్రణవ్ తనదైన నాయకత్వంతో పార్టీని,అభివృద్ధిలో సమన్యాయం పాటిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
…………………………………….