
ఆకేరు న్యూస్, డెస్క్ : న్యాయస్థానాలను రాజకీయ వేదికలుగా మార్చొద్దని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. కరూర్ తొక్కిసలాట (Karur Stampede) ఘటనపై దర్యాప్తును సీబీఐకు అప్పగించాలని తమిళ వెట్రి కళగం (టీవీకే) హైకోర్టును ఆశ్రయించింది. టీవీకే పిటిషన్పై న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగించాలని ఆదేశించలేమని, ప్రారంభ దశలోనే సీబీఐ(CBI)కి బదిలీ చేయాలంటే ఎలా అని ప్రశ్నించింది. కోర్టును రాజకీయ వేదికలుగా మార్చవద్దని ఈ సందర్భంగా న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీళ్లు, ఆహార సదుపాయాలు లేకుండా సభ ఎలా నిర్వహించారని టీవీకేను న్యాయస్థానం ప్రశ్నించింది. టీవీకే (TVK) వేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది.
……………………………………………….