ఆకేరున్యూస్, వరంగల్ : విజయదశమి పండుగను పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ముఖ్య అతిధిగా హాజరై ఆయుధ భాండాగారం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దుర్గామాతతో పాటు ఆయుధాలు యం.టి విభాగంలో పూజలు నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఆవరణలోని శమీవృక్షానికి పూజలు చేసి. అధికారులు, సిబ్బందికి శమీపత్రాలను అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. చివరగా పోలీస్ కమిషనర్ య.టి విభాగంలో పోలీస్ కమిషనర్ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఈస్ట్ డీసీపీ అంకిత్ కుమార్, క్రైం డీసీపీ గుణశేఖర్ అదనపు డీసీపీలు, రవి సురేష్ కుమార్, శ్రీనివాస్, ఏ. ఎస్పీ శుభం, ఏసీపీలు నాగయ్య, మధుసూదన్, అనంతయ్య, సురేంద్ర,, ఆర్.ఐలు స్పర్జన్ రాజ్, శ్రీనివాస్, శ్రీధర్, చంద్రశేఖర్, ఆర్. ఎస్. ఐ లతో ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

…………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
