కేంద్ర సాయుధబలగాల అధికారులను సత్కరిస్తున్న వరంగల్ సీపీ
ఆకేరు న్యూస్, వరంగల్ : పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని ఎన్నికల బందోబస్తు విధులు నిర్వహించి స్వస్థలాలకు వెళుతున్న కేంద్ర సాయుధబలగాల అధికారులను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారం సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ స్థానిక పోలీసులతో పాటు కేంద్ర సాయుధబలగాలు సమన్వయంతో పని చేయడం ద్వారా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించబడ్దయని సీఆర్పీఎఫ్ అధికారులను, సిబ్బందిని అభినందించారు. పోలీస్ కమిషనర్ సత్కరించివారిలో శ్రీమతి సనతోదేవి, సోమ్జిత్ భగత్, శరత్నాథ్, సంజయ్‌కుమార్, అనీష్, రాంనారయణ బిస్వాస్, రాంకుమార్ సా, బాధు, రాంచంద్ర సింగ్ వున్నారు. ఈ కార్యక్రమములో స్పెషల్ ఏసీపీ జితేందర్ రెడ్డి, ఇన్స్‌స్పెక్టర్ పుల్యాల కిషన్ పాల్గొన్నారు.
——————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
