
* బీఆర్ ఎస్ చలో బస్ భవన్ నేపధ్యంలో,,
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీజీ ఆర్ టీసీ పెంచిన బస్ చార్జీలకు నిరసనగా నేడు బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ కార్యక్రమానికి పిలుపినిచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపధ్యంలో ప్రభుత్వం బస్ భవన్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసింది. బీ ఆర్ ఎస్ నాయకులు బస్ భవన్ చేరకుండా గృహ నిర్భంధం చేశారు. మిగతా నాయకులను కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు.బస్ భవన్ వద్ద భారీగా బలగాలను మోహరించారు. ఆర్టీసీ పరిపాలనా కార్యాలయన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారు 600 మందికిపైగా పోలీసుల సిబ్బందిని మోహరించారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్డు నుంచి బస్ భవన్ వైపు వెళ్లే మార్గాన్ని మూసివేశారు.పెద్ద సంఖ్యలో బారికేడ్లు ఏర్పాటుచేసి అటువైపు ఎవరినీ వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో నిత్యం ఆ మార్గం గుండా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుట్టూ తిరిగి వెళ్లలేక ప్రయాణికులు, కార్మికులు, సిబ్బంది, ఇతర వాహనాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్ భవన్ సిబ్బందిని సైతం క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు.
ఇందిరమ్మ రాజ్యమా..? ఎమెర్జెన్సీ కాలమా..?
బీఆర్ ఎస్ నాయకుల గృహ నిర్భంధంపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు.
రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఉప్పల్ మియాపూర్ వర్క్ షాపులను అమ్మకానికి పెట్టారని బస్టాండ్లు కుదువ పెట్టి 15 వందల కోట్లు తెచ్చారని హరీష్ రావు ఆరోపించారు. టికెట్ ధరలు తగ్గించే వరకూ బీఆర్ ఎస్ పోరాటం ఆగదని హరీష్ రావు హెచ్చరించారు.