
* ఎక్స్ వేదికగా కాంగ్రెస్ నేత ట్వీట్
ఆకేరున్యూస్ డెస్క్ : నోబెల్ ( NOBEL PRIZE)శాంతి పురస్కారానికి రాహుల్ గాంధి ( RAHUL GANDHI) అర్హుడు అని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సురేంద్ర సింగ్ రాజ్పుట్ (SURENDRA SING RAJPTH) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రజాస్వామ్య హక్కుల కోసం నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వెనుజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో ( MARIA CORINA MACHADO)కు రాహుల్ గాంధీకి పోలికలు ఉన్నాయన్నారు. వెనుజులాలో ఆమె ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేస్తే భారతదేశంలో రాహుల్ గాంధి అదే పనిచేస్తున్నాడని సురేంద్ర సింగ్ రాజ్పుట్ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేసినందుకు గాను మరియా కొరినా మచాడో కు నోబెల్ పురస్కారం లభించింది.
………………………………………..